23mayipl | ఐపీఎల్‌లో పంజాబ్‌కు కీలక మ్యాచ్

23mayipl | ఐపీఎల్‌లో పంజాబ్‌కు కీలక మ్యాచ్
23mayipl | నేడు లక్నోతో ఢీ
లక్నోవేదికగా మ్యాచ్
రాత్రి 7.30గంటలకు స్టార్ట్
23mayipl | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. లీగ్ దశ చివరికి వచ్చింది. ఇవాళ లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఢీకొననున్నాయి. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను తీవ్రంగా సంక్లిష్టం చేసుకున్న పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ అని చెప్పవచ్చు. ఇందులో ఓడితే పంజాబ్ ఇంటిదారి పట్టాల్సిందే. ఒకవేళ పంజాబ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మాత్రం మొత్తం 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకూ పదమూడు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లలో గెలిచి తొమ్మిది మ్యాచ్ లలో ఓడింది. ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ పదమూడు మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లలో గెలిచి ఆరు మ్యా లలో ఓడింది. పదమూడు పాయింట్లతో ఉంది. అయితే పంజాబ్ వెనకనే కోల్ కతా నైట్ రైడర్స్, ముందు రాజస్థాన్ రాయల్స్ ఉండటంతో పంజాబ్ కింగ్స్ కు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి.
పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచినంత మాత్రాన ప్లేఆఫ్స్ చేరుతుందనే నమ్మకం లేదు. ఇతర మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుతుందా లేదా అనేది తేలుతుంది. ఎలా జరగాలంటే… రేపు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాలి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలన్నీ సరిగ్గా కుదిరితేనే పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఏ ఒక్కటి తారుమారైనా పంజాబ్ ఆశలు గల్లంతే.
ఐపీఎల్ టోర్నీల్లో ఎల్ఎస్ జి మరియు పంజాబ్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 7 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 7 మ్యాచ్‌ల్లో ఎల్ఎస్ జి జట్టు 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు 4 సార్లు గెలిచింది.

లక్నో పంజాబ్
7 ఆడిన మ్యాచులు 7
3 గెలిచింది 4
4 ఓడింది 3
0 ఫలితం తేలలేదు 0
257 అత్యధిక స్కోరు 254
159 అత్యల్ప స్కోరు 133
CLICK HERE TO READ 4wickets Iబ్యాటర్ల విధ్వంసం.. హైదరాబాద్ భారీ స్కోరు!
