ప్రశాంతంగా తాలీమ్-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్

ప్రశాంతంగా తాలీమ్-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్
- జిల్లాలో 86.72 శాతం హాజరు నమోదు
- రెండు కేంద్రాల్లో 405 మంది హాజరు
తిరుపతి, ఆంధ్రప్రభ : వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “తాలీమ్-ఏ-హునర్ టాలెంట్ టెస్ట్–2026” పరీక్షను తిరుపతి జిల్లాలో ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి కె.చిన్నారెడ్డి తెలిపారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాలలో మొత్తం 467 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, అందులో 405 మంది హాజరై 86.72 శాతం హాజరు నమోదైందన్నారు. 62 మంది గైర్హాజరైనట్లు వివరించారు.
పరీక్షా కేంద్రాల వారీగా ఎస్‌పీజేఎన్‌ఎం మున్సిపల్ హై స్కూల్, సరోజినీదేవి రోడ్, తిరుపతిలో 251 మందికి పరీక్ష నిర్వహించగా, 211 మంది హాజరై 40 మంది గైర్హాజరయ్యారు. అలాగే టీపీపీఎం కార్పొరేషన్ మున్సిపల్ హై స్కూల్, టాటా నగర్‌లో 216 మందికి పరీక్ష నిర్వహించగా, 194 మంది హాజరై 22 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు పరీక్షలను అన్ని ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్ర ఇన్‌చార్జిలుగా ఏపీఎస్‌ఎంఎఫ్‌సీ ఈడీ హరినాథ్ రెడ్డి, వక్ఫ్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ వసీం విధులు నిర్వహించారు.
