అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములపై నిర్మాణాలు
- కాలువలోనే విద్యుత్ స్తంభాలు
- కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు నిలిపివేసిన ఎమ్మార్వో
- రాత్రులు కాలువ నిర్మాణ పనులు జరుగుతున్న పట్టించుకోని అధికారులు
- అధికార పార్టీ అండదండల లేక మరి ఇంకేమైనా
- మా పొలం నుంచి కాలువ వెళుతుందని రైతుల ఆందోళన
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ డొంక రోడ్డులో అక్రమంగా ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మురుగు కాలువ నిర్మిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో నిలిపివేసిన కాలువ నిర్మాణ పనులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రులు నిర్మిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని రామవరప్పాడు రింగ్ ప్లే ఓవర్ సమీపంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన గ్రేట్ కమ్యూనిటీలో మురుగునీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో అనుమతులు లేకుండానే అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూమిలో ములుగు కాలువ యధేచ్చగా నిర్మిస్తున్నారు.
గ్రేటెడ్ కమ్యూనిటీ నుంచి వచ్చే మురుగు బుడమేరు కాలువలు కలిపేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంది. కోట్లలో విల్లాస్ ఉన్న ఈ కమ్యూనిటీలో మురుగునీరు బయటకు వెళ్లేందుకు దారి లేదు. సీఆర్డీఏ అనుమతులు తీసుకునేటప్పుడు డ్రైను నిర్మాణ పనులు కూడా పొందుపరుస్తారు అది చూసిన తర్వాతే సీఆర్డీఏ అధికారులు నియమ నిబంధనకు అనుమతులు ఇస్తారు. కానీ అసలు డ్రైనేలేని కమ్యూనిటీకి ఏ విధంగా సీఆర్డీఏ అధికారులు అనుమతులు ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గ్రేటర్ కమ్యూనిటీ నుంచి మురుగునీరు వెళ్లేందుకు పంచాయతీ రోడ్లు కట్ చేసి తూములు ఏర్పాటు చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇదే కాలువలు ప్రభుత్వ విద్యుత్ స్తంభాలు ఉన్న విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. విల్లాస్ లో నివసించే ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు అండదండలతోనే ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
గత మూడు రోజుల క్రితం రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రూరల్ మండలం తహసీల్దార్ సుగుణ, ఎంపీడీవో పార్థసారథి విద్యుత్ శాఖ అధికారులతో కలిసి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కాలువ పనులను నిలిపివేశారు. అయినా కాలువ పరులు రాత్రి పగలు తేడా లేకుండా కొనసాగడం పై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలువ నిర్మాణం జరిగేందుకు లక్షల్లో డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మురుగు కాలువ పనులను నిలిపివేసి కాలువ నిర్మించే వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

