17thMayeditorial | హిందీపై మళ్లీ రాజకీయ చర్చలు

17thMayeditorial | హిందీపై మళ్లీ రాజకీయ చర్చలు

17thMayeditorial | జూలై నుంచి సీబీఎస్‌ఈలో త్రిభాషా అమలు
జాతీయ విద్యావిధానంలో కీలక మార్పులు
దేశ ఐక్యతకు త్రిభాషా సూత్రం అవసరమా?
భాషా విధానంపై రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు

17thMayeditorial | త్రిభాషా సూత్రం అనేది జాతిపిత మహాత్మాగాంధీ బోధనలలో ఒకటి. ఆయన హిందీని జాతీయ భాషగా పరిగణించి అభ్యసించాలన్న ఉద్దేశ్యంతో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు. అయితే, దక్షిణాదిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండటంతో త్రిభాషా సూత్రాన్ని పక్కనపెట్టారు. అయితే, ఇప్పుడు కేంద్రం జాతీయ విద్యా విధానంలో భాగంగా తొమ్మది, పది తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. జూలై నుంచి ఇది అమలులోకి వస్తుంది. సెంటర్ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం మూడు భాషల్లో రెండు భారతీయ భాషలై ఉండాలి. మూడు భాషలను అధ్యయనం చేయాలి.

పదో తరగతిలో మాత్రం మూడో భాషకు బోర్డు ఎగ్జామినేషన్ ఉండదని ప్రకటించింది. భాషాధ్యయనంపై విద్యార్థులు దృష్టిని కేంద్రీకరించేలా, అనవసర ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ప్రకటించింది. త్రిభాషా సూత్రంలో కూడా హిందీ లేదా సంస్కృతాన్ని విద్యార్థులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకునే విధానం ఇప్పుడు ఉంది. దక్షిణాదిన కూడా హిందీని ఐచ్చికంగా అభ్యసించేవారు ఇప్పుడు లక్షలాది మంది ఉన్నారు. హిందీలో పట్టాలు పొందిన వారు ఉత్తరాదిన మంచి ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఉన్నారు.

జాతీయ విద్యావిధానంలో త్రిభాష విధానం ఒక భాగం. విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని జాతీయ విద్యావిధానం -2020 సిఫార్సు చేసింది. వీటిలో రెండు భారతీయ భాషలు ఉండాలి. విద్యార్థులకు నేర్పించాల్సిన భాషలేమిటన్నదానిపై అధికారం రాష్ట్రాలదేనని సెంట్రల్ బోర్డు స్పష్టం చేసింది. గతంలో ఎంకె స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం హిందీని వ్యతిరేకించింది. మహారాష్ట్రలో హిందీని తప్పనిసరిగా బోధించాలని ఆదేశించింది.

17thMayeditorial

తర్వాత విమర్శలు రావడంతో త్రిభాషా సూత్రానికి సంబంధించిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. హిందీని స్వచ్చందంగా నేర్చుకోవడానికి వీలు కల్పించే విధానాన్ని గతంలో అమలు జరిపారు. అయితే, రాజకీయ ప్రయోజనాల రీత్యా హిందీని పక్కన పెట్టారు. హిందీ విషయంలో నిర్బంధం ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఐచ్చికంగా హిందీని చదువుకునే విద్యార్థులు మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. హిందీని జాతీయ భాషగా అప్పట్లో చేశారు. రాజకీయ వివాదాల వల్ల అది అమలు జరగడం లేదు. దీంతో సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలన్న అంశం తెరమీదికి వచ్చింది.

భారతీయ భాషల్లో తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యానించారు. తెలుగును ఐచ్చికంగా అభ్యసించేవారు హర్యానా తదితర రాష్ట్రాల్లో ఉన్నారు. హర్యానాకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు విద్యాబోధనను పరిశీలించేందుకు దశాబ్దాల క్రితమే పర్యటనకు వచ్చారు. అయితే, తమిళం ప్రాచీనమైన భాష అని సుప్రసిద్ధ సినీనటుడు కమలహాసన్ వాదిస్తూ వచ్చారు. దానిపై కర్నాటకలో వివాదం ప్రారంభం కావడంతో వెనక్కి తగ్గారు.

దేశంలో భాషలన్నింటికీ ప్రాధాన్యం ఉంది. ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం ఏ భాషనైనా నేర్చుకునేందుకు మన వారు వెనుకాడరు. సీబీఎస్‌ఈ తీసుకువస్తున్న త్రిభాషా విధానంపై ప్రజల స్పందన ఏమిటో ఇంకా బయటికి రాలేదు. విదేశీ భాషల విషయంలో నియంత్రణ ఉన్నా, హిందీ విషయంలో ఉండరాదన్నది దేశంలో అధిక సంఖ్యాకుల అభిప్రాయం. జూలై నుంచి అమలులోకి వచ్చే త్రిభాష విధానంపై ప్రజల స్పందన ఏమిటో రెండు నెలల్లోనే తెలుస్తుంది. త్రిభాషా విధానం దేశ ఐక్యతకు అత్యవసరం అని ఆనాడే మహాత్ముడు స్పష్టంచేశారు.

CLICK HERE TO READ Karnataka Politics | కర్నాటకలో మళ్లీ సీఎం వివాదం

CLICK HERE TO READ MORE

Leave a Reply