165people | టీవీకే పార్టీకి జనాదరణ
165people | టీవీకే పార్టీకి జనాదరణ
బీజేపీ, టీఎంసీ హోరాహోరీ
అస్సాం మళ్లీ బీజేపీదే
కేరళంలో యూడీఎఫ్‌కు మొగ్గు
165people | ఎలక్షన్ డెస్క్, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇవి కొన్ని రాష్ట్రాలకే పరిమితమైనా, రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆయా కేంద్రాల్లోకి అనధికారిక వ్యక్తులెవరూ అడుగుపెట్టడానికి వీల్లేకుండా ఎన్నికల సంఘం క్యూఆర్ కోడ్ ఆధారిత ఐడీ కార్డుల పద్ధతిని ప్రవేశపెట్టింది. ఒక స్థానంలో రీపోలింగ్ జరగాల్సి ఉండటంతో పశ్చిమ బెంగాల్లో మిగిలిన 293 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో 10 కేంద్రాలను తగ్గించడంతో పాటు అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. ఈవీఎంలను తారుమారు చేస్తారంటూ తృణమూల్ అగ్రనేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం 165 మంది అదనపు లెక్కింపు పర్యవేక్షకులను, 77 మంది పోలీసు పర్యవేక్షకుల్ని నియమించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బంగాల్, అసోం, కేరళం, తమిళనాడుల్లో ఎన్నికల సంఘం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది.
165people | పిక్చర్ వచ్చేసింది.. ఏ రాష్ట్రాల్లో ఎవరంటే..
బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. కేరళలో యూడీఎఫ్ రాబోతోంది. కానీ.. తమిళనాడులో హంగ్ వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం అన్ని స్థానాలకూ కౌంటింగ్ జరుగుతోంది. మెజార్టీ మార్క్ 118 ఉండగా.. దాన్ని ఏ పార్టీ కూడా చేరుకునేలా లేదు. విజయ్ పార్టీ టీవీకే 104 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నా.. మెజార్టీ మార్కుకి చాలా దూరంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. కాబట్టి.. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే.. డీఎంకే లేదా బీజేపీ లేదా అన్నాడీఎంకేతో జట్టు కట్టాల్సి ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వం తప్పదు. ఇప్పటికైతే ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ.. నెక్ట్స్ రిసార్ట్ రాజకీయాలు ఎలాంటి మలుపులైనా తిప్పవచ్చు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చెయ్యవచ్చు.. ఏమైనా జరగొచ్చు. కాబట్టి.. తమిళ ఎన్నికల్లో రసవత్తర పాలిటిక్స్ ని చూడగలమని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.
165people | అదరగొడుతున్న విజయ్ టీవీకే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ అదరగొడుతోంది. 104కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటి వద్ద అధికారులు భద్రత పెంచారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో భద్రత పెంచారు. ఇతర వాహనాలను అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరికాసేపట్లో ఆ రాష్ట్ర డీజీపీ దళపతి విజయ్‌ని కలిసే అవకాశం ఉంది.
165people | బోసిపోయిన డీఎంకే కార్యాలయం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో డీఎంకే కార్యాలయం బోసిపోయింది. సంబరాల కోసం వేసిన టెంట్లను డీఎంకే కార్యకర్తలు తీసేస్తున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో సీఎం స్టాలిన్ సహా 28మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
165people | సానుకూలత కోసం వెయిటింగ్..
అసోంలో సానుకూల ఫలితాల కోసం వేచి చూస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ తెలిపారు. ప్రతి రౌండ్ కౌంటింగ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు అబ్జర్వర్లను పంపానని వెల్లడించారు. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితి కనపడితే వారు వెంటనే తెలియజేస్తారని అన్నారు. వాడకుండా ఉన్న ఈవీఎంలను కూడా భద్రపరిచినట్లు దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈసీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
CLICK HERE TO READ MORE : seats234 | ఆధిక్యంలో టీవీకే పార్టీ
