1st step Iదళపతి మాస్టర్ ప్లాన్‌తో పాలిటిక్స్‌ ఎంట్రీ


1st step I దళపతి మాస్టర్ ప్లాన్‌తో పాలిటిక్స్‌ ఎంట్రీ

1st step I ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయపై కొత్త రక్తం ఉరకలేస్తోంది. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన స్టార్ హీరో విజయ్, మొదటి అడుగులోనే అద్భుతమైన సత్తా చాటుతున్నారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో టీవీకే భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండటంతో రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెరపైకి తెచ్చారు.

సినిమాలకు గుడ్ బై..
గతంలో కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించినప్పుడు, వారు అటు సినిమాలు చేస్తూనే ఇటు రాజకీయం నడిపించాలని చూశారు. రెండు పడవల ప్రయాణంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో కమల్ విఫలమయ్యారని విశ్లేషకులు భావిస్తారు. అయితే, విజయ్ ఆ తప్పు చేయలేదు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే, చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులను ముగించి, ఇకపై సినిమాలు చేయనని, తన జీవితం ప్రజలకే అంకితమని ప్రకటించడం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది.

విజయ్ సక్సెస్ ఫార్ములా…
విజయ్ రాజకీయాల్లో ఇంతటి ప్రభావాన్ని చూపడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సినిమాలను వదిలేయడం వల్ల విజయ్ పార్ట్-టైమ్ పొలిటీషియన్ కాదని, సీరియస్ లీడర్ అని ప్రజల్లోకి బలమైన సంకేతం వెళ్లింది. కేవలం సోషల్ మీడియా లేదా ప్రసంగాలకే పరిమితం కాకుండా, విజయ్ తన అభిమాన సంఘాలను పార్టీ కార్యకర్తలుగా మార్చి గ్రామస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి ముందుకు సాగారు.

Leave a Reply