శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు
హుండీ ద్వారా(159 రోజులకు) వచ్చిన కానుకలు రూ” 3,92,977/-
అధికారుల పర్యవేక్షణలో పారదర్శక లెక్కింపు
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పాతబస్తీ బ్రాహ్మణ వీధి కొత్త గుళ్ళు లో వీంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి నాగం సన్యాసిరావు ఆధ్వర్యంలో బుధవారం లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. లెక్కించిన కానుకలు మొత్తం రూ=3,92,977/- గా నమోదయింది.
ఈ మొత్తం గత 159 రోజులు కాలానికి సంబంధించినవిగా వివరించారు. ఈ మొత్తాన్ని ఆలయ బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.శ్రీ దీనవాహి సత్రం కార్యనిర్వహణాధి పి.మోహన్ రావు పర్యవేక్షణలో నిర్వహించిన లెక్కింపు కార్యక్రమంలో శ్రీ భవాని దీక్ష పీఠం విజయవాడ సేవా బృందం వారు, సిబ్బంది, అర్చకులు, భక్తులు, అధికారులు, స్థానిక ప్రముఖుల సమక్షంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు.
