Box office War | మహేష్‌, పవన్ గెలిచేది ఎవరు..?

Box office War | మహేష్‌, పవన్ గెలిచేది ఎవరు..?

పాత సినిమాలను కొత్తగా రిలీజ్(New release) చేయడం అనేది ట్రెండ్ గా మారింది. అదే.. రీ రిలీజ్. ఈ రీ రిలీజ్ ట్రెండ్ అనేది సూపర్ స్టార్ మహేష్‌ బాబు పోకిరి సినిమాతో స్టార్ట్ అయ్యింది. ఇక అక్కడ నుంచి పాత సినిమాలను(Old movies) కొత్తగా రిలీజ్ చేయడం ఎక్కువ అయ్యింది. సందర్భం ఉన్నా.. లేకపోయినా.. జనాలు చూస్తున్నారు కదా అని అదే పనిగా పాత సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈమధ్య ఈ రీ రిలీజ్ లు కాస్త తగ్గాయి అనిపించినా.. మళ్లీ జోరు(Loud again) పెరిగింది. అయితే.. ఇప్పుడు మురారి వెర్సెస్ జల్సా అనేట్టుగా పోటీ ఏర్పడింది. ఇంతకీ.. ఈ సినిమాలు ఇప్పుడు పోటీ పడడం ఏంటి..? అసలు ఏం జరుగుతోంది..?

Box office War | మరచిపోలేని మురారి..

Box office War

మురారి.. మహేష్‌ బాబు కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో అదొకటి. మహేష్‌ నటించిన నాలుగవ సినిమా(The fourth movie) అది. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన మురారి సినిమా మహేష్ బాబుకు కమర్షియల్ గా సక్సెస్ అందించడంతో పాటు.. మంచి పేరును కూడా తీసుకువచ్చింది. ఇందులో మహేష్‌ బాబుకు(For Mahesh Babu) జంటగా సోనాలీ బింద్రే నటించింది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఈ సినిమాను ఇప్పుడు 4కే హంగులతో డిసెంబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు.

Box office War | జల్సా ఓ సంచలనం..

Box office War

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Magician Trivikram Srinivas).. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన చిత్రం జల్సా. ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందివ్వడం విశేషం. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన జల్సా మూవీ రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్(Create a sensation) చేసింది. ఈ సినిమాలోని పాటలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. పవర్ స్టార్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించడంతో జల్సా మూవీ అభిమానులకు ఓ స్పెషల్ మూవీగా నిలిచింది.

Box office War | రీ రిలీజ్ వార్..

Box office War

కొత్త సినిమాలు రిలీజ్ అయితే.. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంత..? ఎలాంటి రికార్డ్ క్రియేట్(Create a record) చేసింది…? ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేసింది..? టోటల్ కలెక్షన్(Total Collection) ఎంత…? ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది..? ఎన్ని సెంటర్స్ లో 100 రోజులు ఆడింది…? ఇలా రికార్డుల కోసం అభిమానులు పోటీపడేవారు. అయితే.. ఇప్పుడు రీ రిలీజ్ విషయంలో కూడా అభిమానులు పోటీపడుతుండడం విశేషం. జల్సా మూవీని కూడా డిసెంబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో డిసెంబర్ 31న రీ రిలీజ్ అవుతున్న తమ హీరో సినిమా(Hero movie)కే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయంటే.. కాదు మా హీరో సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌ అభిమానుల మధ్య ట్వీట్స్ వార్ నడుస్తుంది. మరి.. సూపర్ స్టార్ మురారి, పవర్ స్టార్ జల్సా.. ఈ రెండు సినిమాల రీ రిలీజ్ లలో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్(Collect) చేస్తుందో చూడాలి.

CLICK HERE TO READ విమానానికి బాంబు బెదిరింపు

CLICK HERE TO READ MORE

Leave a Reply