కూటమి రెండేళ్ల పాలన.. సంక్షేమంతో అన్ని వర్గాలకు భరోసా
కూటమి రెండేళ్ల పాలన.. సంక్షేమంతో అన్ని వర్గాలకు భరోసా
రెండేళ్ల పాలన పూర్తి – తిరుపతిలో భారీ సభ
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మద్దతు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో సామాజిక భద్రత
అన్న క్యాంటీన్లు – అందరికీ అందుబాటులో ఆహారం
స్త్రీశక్తి పథకం – మహిళలకు కొత్త ఆర్థిక స్వేచ్ఛ
అమరావతి, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం కొలువుతీరిన నేటికి రెండేళ్లు అయింది. అనేక కష్టాలతో, విధ్వంసమైన వ్యవస్థల నడుమ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జీతాలే సరిగా ఇవ్వలేని తీవ్ర పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా వీలు లేని విధంగా అప్పటి వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి.
పైసా ఖర్చు పెట్టాలన్నా అనేక రకాలుగా ఆలోచించే పరిస్థితి నాడు ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గట్టెక్కించారు. సంపద పెంచారు.. ఆ మేరకు సంక్షేమం అందించి సకల జనుల పాలన తీసుకువచ్చారు. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమం రికార్డులు సృష్టిస్తోంది. సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా చేయాలనే అంశంపై వివిధ రాష్ట్రాలు ఏపీ వైపే చూస్తున్నాయి.
రెండేళ్ల కాలంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇస్తున్న సామాజిక భద్రతా పెన్షన్ల మొత్తం అక్షరాలా రూ. 65,887 కోట్లు. అంటే ఏడాదికి సుమారు రూ.33 వేల కోట్లను పేదల సేవలో పేరుతో పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఏపీ ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4 వేలు చేసింది. ఇది ఒక గణనీయమైన సంక్షేమ చర్యగా పేర్కొనబడుతోంది.
అలాగే పేదవాడికి మూడు పూటలా తిండి పెట్టే అన్న క్యాంటీన్ల ఏర్పాటు దగ్గర నుంచి పేద, మధ్య తరగతి ప్రజలు గౌరవంగా జీవనం సాగించేందుకు అవసరమైన ప్రతీ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చూసుకుంటోంది.
ప్రతీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు
కూటమి రెండేళ్ల పాలనలో తొలి రోజు నుంచి సంక్షేమానికే ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద పీట వేశారు. ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేశారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా ఆడిన మాట తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు.
సంక్షేమ పథకాలంటే ఏదో ఒక వర్గానికి చెందిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసుకుని లక్ష్యం చేసుకుని అందించడమనేది ప్రభుత్వాలకు అలవాటు. కానీ దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని, ప్రభుత్వ సబ్సిడీలను అందించేలా పథకాలను అమలు చేసింది. ఇది ఒక విస్తృత సంక్షేమ మోడల్గా పేర్కొనబడుతోంది.
అన్న క్యాంటీన్లల్లో ఫలానా వర్గం వాళ్లకే భోజనం అనే రూల్ లేదు. అలాగే పేదవారికే అనే ఆంక్షలు లేవు. అన్న క్యాంటీన్లకు ఎవరైనా రావచ్చు.. ఎవరైనా తినొచ్చు.. ఇదీ విధానం. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా పేదలు, ఆటోడ్రైవర్లు, రోజుకూలీలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. నెలకు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ఆదా చేసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 269 క్యాంటీన్లు ఉంటే వాటి కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.230 కోట్లను వెచ్చించింది. ఇది ఒక ప్రభావవంతమైన ప్రజాహిత పథకంగా నిలుస్తోంది.
ఇక మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ స్త్రీశక్తి పథకాన్ని కూడా పేద, మధ్య తరగతి నిబంధనలేవీ లేకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు.
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, స్వయం ఉపాధి మహిళలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థినులు ఈ పథకం ద్వారా గణనీయంగా లాభపడుతున్నారు. వివిధ పుణ్యక్షేత్రాలకు, టూరిస్ట్ స్పాట్లకు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. గతంలో ఉన్న క్యూలైన్ల సమస్యలు తొలగిపోయాయి.
ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ.2,565 కోట్ల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరించింది. ఇది ఒక భారీ సంక్షేమ పెట్టుబడిగా భావించబడుతోంది.
నేడు తిరుపతిలో భారీ బహిరంగ సభ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి అగ్రనేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
