రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్న అంబులెన్స్ ఉద్యోగులు

రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్న అంబులెన్స్ ఉద్యోగులు

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్రైబల్ ఏరియాకు గాను మంచిర్యాల జిల్లా జన్నారం మండల 108 అంబులెన్స్ ఈఎంటీ కిషన్, పైలెట్ ఎం.డి రఫీక్ లు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు అందుకున్నారు.
మంగళవారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టియానో, హెల్త్ కమిషనర్ సంగీతల చేతుల రాష్ట్ర ఉత్తమ అవార్డులను, ప్రశంసా పత్రాలను జన్నారం 108 అంబులెన్స్ ఈఎంటీ కిషన్,పైలట్ రఫీక్ లు అందుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ఉద్యోగులను స్టేట్ హెడ్ ఆపరేషన్ బత్తుల సుధాకర్, ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, జిల్లా ఈఎంఈ కొండలరావు, పలువురు మిత్రులు అభినందించారు.
