- డిఫెండింగ్ చాంప్ గా ఆర్సీబీ
- టాస్ గెలిచిన బెంగళూరు
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ కు తెరలేచింది. గుజరాత్ లోని వడోదర స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, టైటిల్ కోసం మొత్తం ఐదు జట్లు తలపడుతుండగా.. గతేడాది టైటిల్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. మరోసారి టైటిల్ దక్కించుకోవాలని ఉత్సాహంగా ఉంది.
కాగా, నేటి ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీ – గుజరాత్ జేయింట్స్ మహిళల జట్లు తపడనుండగా.. టాస్ గెటిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ బ్యాటింగ్ చేయనుంది.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ : స్మృతి మంధాన (కెప్టెన్), డేనియల్ నికోల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ ఆనంద్ బిస్త్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, ప్రేమ రావత్, వీజే జోషిక్, రేణుకా థాయ్
ఆర్సీబీ నుంచి ఐదుగురు మహిళలు రంగంలోకి దిగుతున్నారు. డాని వ్యాట్-హాడ్జ్, కిమ్ గార్త్, ప్రేమ రావత్, రాఘవి బిస్త్, జోషిత వీజే డబ్ల్యూపీఎల్ తో RCB తరపున తమ మొదటి గేమ్ ఆడుతున్నారు.
గుజరాత్ జెయింట్స్ ఉమెన్ : లారా వోల్వార్డ్ట్, బెత్ మూనీ (వికెట్ కీపర్), దయాలన్ హేమలత, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్, సిమ్రాన్ షేక్, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, ప్రియా మిశ్రా
డియాండ్రా డాటిన్, కష్వీ గౌతమ్, సిమ్రాన్ షేక్, సయాలీ సత్ఘరే, ప్రియా మిశ్రా గుజరాత్‌కు ఫ్రాంచైజీ కోసం తమ మొదటి గేమ్‌ను ఆడుతున్నారు.
కాగా, ఈ టోర్నీలో ఈటోర్నీలో రాయల్ చాలెంజర్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2023లో జరిగిన తొలి ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ గెలిచింది. రెండో సీజన్ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అయితే గత రెండు ఎడిషన్లలో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలిచింది.
కాగా, ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు దాదాపు నెల రోజుల పాటు జరగనుండగా.. ప్రతి జట్టు మరో జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. మొత్తం 20 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. టాప్ 2, 3 జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.