Nandigama | పనులు నాణ్యతతో చేపట్టాలి

Nandigama | పనులు నాణ్యతతో చేపట్టాలి
నందిగామ వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి పనుల పరిశీలన
పలు సూచనలు చేసిన విప్ తంగిరాల సౌమ్య

Nandigama | ఆంధ్రప్రభ, నందిగామ : పట్టణంలోని నందిగామ (Nandigama) డీవీఆర్ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా చేపడుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని అభివృద్ధి చేయడం ద్వారా నందిగామ నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుందన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు సమానంగా వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


