మహిళల చదువు దేశానికి వెలుగు
మహిళల చదువు దేశానికి వెలుగు
మంథని రూరల్, ఆంధ్రప్రభ : మహిళల చదువు దేశానికి వెలుగు అని కన్నాల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం మంథని మండలం కన్నాల గ్రామంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మహిళల గ్రూప్ సభ్యులకు ఉల్లాస్ నవభారత ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గట్టయ్య యాదవ్ మాట్లాడుతూ మహిళలందరూ చదువుకోవాలని చదువుకుంటే ప్రతి విషయంపై అవగాహన కలుగుతుందని వివరించారు.
అందరూ చదువుకుని సంతకం వచ్చే విధంగా నేర్చుకోవాలని మహిళా గ్రూపు సభ్యులను సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు రజిత, సిఏ కోమలత, మహిళ గ్రూప్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
