9వ వార్డులో విస్తృత ప్రచారం..

బైంసా, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరగనున్న బైంసా మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఓటర్లు పెద్ద మనసుతో తనకు ఈసారి కౌన్సిలర్ గా అవకాశం ఇప్పించాలని 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాధవి అరవింద్ పేర్కొన్నారు . ఈ మేరకు శనివారం పట్టణంలోని 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే తనను ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపిస్తే కాలనీలో ఉన్న సమస్యలను గెలిచిన రెండు నెలల్లోని పరిష్కరించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు.. ఎన్నికల్లో తనకు కౌన్సిలర్ గా అవకాశం కల్పించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా వార్డుల ఇంచార్జ్లు, కార్యకర్తలతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply