విశారదన్ అరెస్ట్ ను కండిస్తూ జేఏసీ ఆందోళన

విశారదన్ అరెస్ట్ ను కండిస్తూ జేఏసీ ఆందోళన

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ జేఏసీ ఎసి, బీసీ,యస్ టి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ – జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్ మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా, వెలుగుమట్ల భూదాన్ భూముల సమస్యలపై పూర్తిగా ప్రతి బాధితులకి న్యాయం జరగాలని మరొక్కసారి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఖమ్మం బయలుదేరిన డా.విశారదన్ మహరాజ్ అక్రమంగా అరెస్టు చేస్తూ ఖమ్మం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్న క్రమంలో విశారదన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా కో ఆర్డినేటర్ సాయి మహారాజ్ మాట్లాడుతూ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి వెలుగుమట్ల భూదాన్ భూముల సమస్యలపై పూర్తిగా ప్రతి బాధితులకి న్యాయం జరగాలని మరొక్కసారి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఖమ్మం బయలుదేరిన డా.విశారదన్ మహరాజ్ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,ప్రజా పాలన అని రెడ్ల పాలన చేస్తున్న రేవంత్ రెడ్డిరాత్రి 8 గంటల వరకు విడుదల లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల అందరిని కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు,రాస్తారోకోలు చేస్తామని రాష్ట్ర దిగ్బంధం చేస్తామని అన్నారు.


ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బాలయ్య ముదిరాజ్,జిల్లా కన్వీనర్ పెబ్బేటి నిరంజన్ ముదిరాజ్,నాయకులు కొప్పు సురేష్,నాగార్జున,కరాటే రాజు,బాలకృష్ణ,రమేష్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శివ,వనపర్తి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ,శేఖర్ యాదవ్ పాల్గొన్నారు.

Leave a Reply