Uttam | అదే టార్గెట్…

Uttam | అదే టార్గెట్…
- స్తానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
- కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ దిశా నిర్దేశం
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : స్తానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, ఫౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను పిలుపునిచ్చారు.
శనివారం హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించి, స్తానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సమర్థంగా ఎంపిక చేసి, వారి విజయానికి కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు రాకుండా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ముఖ్య నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయం చేసుకొని వ్యూహాత్మకంగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, అరుణ్ కుమార్ దేశుముఖ్, కోతి సంపత్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, దొంగరి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
