సీఎం చంద్రబాబుకు సాదర వీడ్కోలు
రేణిగుంట, ఆంధ్రప్రభ: తిరుపతి జిల్లా పర్యటనను ముగించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నుంచి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో జరగనున్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి బయలుదేరారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రికి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆర్డీఓ భాను ప్రకాశ్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు సాదరంగా వీడ్కోలు పలికారు.
