Warangal | సంక్షేమ పథకాలు అందించాలి…
Warangal | సంక్షేమ పథకాలు అందించాలి…
Warangal | కరీమాబాద్, ఆంధ్ర ప్రభ : వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను సిఎస్సి హెల్త్ సెంటర్లను రద్దు చేయాలనీ పెన్షన్ సహజ మరణానికి ఐదు లక్షలకు పెంచి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ(AITUC) భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గన్నారపు రమేష్ అన్నారు.
ఈ రోజు శివనగర్ తమ్మర భవన్ లో ఏఐటియుసి, సిఐటియు. ఐఎఫ్టియు. బి ఎన్ ఆర్ కె ఎస్, టి బి ఎన్ ఆర్ కే ఎస్(BNRKS, TBNRKKS), భవన నిర్మాణ కార్మిక సంఘాల రౌండ్ టేబుల్(Round Table) సమావేశం ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మియాపురం గోవర్ధన్, ఏఐసిటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ధూపాక రాజుల అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ గన్నారపు రమేష్, సిఐటియు జిల్లాకార్యదర్శి ఆరూరి కుమార్, ఏఐసిటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం సాగర్, బీఎన్ఆర్ కే జిల్లా అధ్యక్షుడు సిలువేరు రాజేందర్, టి బి ఎన్ ఆర్ కే ఎస్ రాష్ట్ర నాయకులు దశరథం రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
గన్నారపు రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్(Private Insurance) కంపెనీలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి, జీవో నెంబర్ 12 ని సవరించి ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలనీ అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా గుర్తింపు లేని ప్రైవేట్ బీమా కంపెనీలకు ఇచ్చిన 346 కోట్లు తిరిగి వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలన్నారు. 1996 కేంద్ర చట్టం నిబంధనలను ధిక్కరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, వెల్ఫేర్ బోర్డు నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. బోర్డు నిధులు కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలనీ, కార్మికులకు ఉపయోగపడని సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
60 సంవత్సరాల వయసు పైపడిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం, పిల్లలకు స్కాలర్షిప్లు, గృహ వసతి కల్పించాలని, సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు పెంచాలన్నారు. రిన్వల్ కానీ లేబర్ కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందనీ అన్నారు.
