బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి..
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన నివాళి అర్పించిన మహబూబ్‌నగర్ జిల్లా DCC అధ్యక్షులు శ్రీ ఎ. సంజీవ్ ముదిరాజ్, పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీ ఎ. సంజీవ్ ముదిరాజ్, మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలు దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, సామాజిక సమానత్వం, దళితుల సాధికారత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో SC సెల్ అధ్యక్షులు పి. రాజు, ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, DCC జనరల్ సెక్రటరీ బండ్ల రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చందు యాదవ్. తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
