ప్రపంచ జూనోసిస్ దినోత్సవం..
ఆమదాలవలస, ఆంధ్రప్రభ : ప్రాంతీయ పశువైద్యశాలలో ఏడి జి. నారాయణరావు ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రేబిస్, బ్రూసెల్లోసిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి జూనోటిక్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. జంతువులకు టీకాలు వేశారు.జంతువుల ద్వారా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వైద్యులు మెట్ట జ్యోత్స్న, ఎల్ఎస్ఏ జి. లోకనాథం, పశువైద్య సిబ్బంది ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
