పోలీసు సిబ్బందికి రెయిన్‌కోట్లు పంపిణీ..

సిరిసిల్ల, ఆంధ్రప్రభ: జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బందికి మంజూరైన రెయిన్‌కోట్లను ఎస్పీ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వర్షాకాలంలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం నుంచి మంజూరైన రెయిన్‌కోట్లను అందజేశామని తెలిపారు.

పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ (అడ్మిన్) సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.