Vijay Devarakonda | లైనప్ అదిరింది..

Vijay Devarakonda | లైనప్ అదిరింది..

Vijay Devarakonda | విజయ్ దేవరకొండ లైనప్ అదిరిపోయింది
రణబాలి, రౌడీ జనార్థన సినిమాలపై భారీ అంచనాలు
విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా
హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ మూవీ
ఎన్టీఆర్, చరణ్‌, నాని రిజెక్ట్ చేసిన కథ
చివరికి విజయ్ దేవరకొండకు దక్కిన క్రేజీ ప్రాజెక్ట్

Vijay Devarakonda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మరో సినిమాకి ఓకే చెప్పినట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. న్యూస్ (News) లీకైంది. ఈ సినిమా కథ ముగ్గురు హీరోల దగ్గరకి వెళ్లి ఆతర్వాత విజయ్ దగ్గరకి వచ్చిందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. విజయ్ ఏ డైరెక్టర్ కి ఓకే చెప్పాడు..? ఆ కథను రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోలు ఎవరు..?

Vijay Devarakonda | ఈ రెండు సినిమాలో విజయం ఖాయం..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్థన, రణబాలి అనే రెండు వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా రెగ్యులర్ చిత్రాలు కాదు. వైవిధ్యంగా ఉండే కథలతో రూపొందుతున్నాయి. రణబాలి సినిమాని రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తుంటే.. రౌడీ జనార్థన సినిమాని రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) తెరకెక్కిస్తున్నారు. రణబాలి సెప్టెంబర్ 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. రౌడీ జనార్థన డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాల పై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఈ రెండు సినిమాలతో విజయ్ ఫామ్ లోకి రావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Vijay Devarakonda | నాని డైరెక్టర్ తో విజయ్..

ఈ రెండు సినిమాలు కాకుండా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీసే.. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో విజయ్ ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ అఫీషియల్ గా ఇవ్వనున్నారు. కొత్తగా విజయ్ ఓకే చెప్పింది ఎవరకంటే.. హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ అని తెలిసింది. హాయ్ నాన్న సినిమా తర్వాత శౌర్యువ్ ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేసి ఎన్టీఆర్ (NTR) కి చెప్పాడు. ఎన్టీఆర్, శౌర్యువ్ మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. ఆతర్వాత అందులో వాస్తవం లేదని తెలిసింది.

Vijay Devarakonda | ఎన్టీఆర్, చరణ్‌, నాని..

ఆతర్వాత రామ్ చరణ్‌ కి శౌర్యువ్ కథ చెప్పడం జరిగింది. ఈ కాంబో కూడా సెట్ అవుతుంది అనుకుంటే సెట్ కాలేదు. ఆతర్వాత నానితోనే మళ్లీ సినిమా (Movie) చేయాలని ట్రై చేశాడు కానీ.. నేచురల్ స్టార్ బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఇలా ఎన్టీఆర్, చరణ్‌, నాని దగ్గరకు వెళ్లిన కథ ఆఖరికి విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. ఆయనకు ఈ కథ చెబితే నచ్చి వెంటనే ఓకే చెప్పాడట. అలా.. ఈ కాంబో సెట్ అయ్యిందని.. ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా త్వరలో రానుంది. మొత్తానికి విజయ్ లైనప్ మామూలుగా లేదుగా..