vigilance inquiry | భూదాన్ భూముల వ్యవహారంలో దర్యాప్తు

vigilance inquiry | భూదాన్ భూముల వ్యవహారంలో దర్యాప్తు

vigilance inquiry | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ.. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈసారి మూడు సేల్ డీడ్‌ల వివరాలతో విచారణకు రావాలని అమోయ్ కుమార్‌కు ఈడీ సూచించింది. గతంలో 2024లో కూడా ఈ వ్యవహారంపై ఆయనను విచారించిన సంగతి తెలిసిందే. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. 42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్.. 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణలో ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇదే కేసులో అప్పటి ఎంఆర్ఓ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌, ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ యజమాని కొండపల్లి శ్రీధర్‌పై కూడా కేసులు నమోదయ్యాయి.

నాగారంలోని సర్వే నంబర్లు 181, 182లోని 102.2 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. అందులో 50 ఎకరాలు భూదాన్ బోర్డుకు చెందినవని అధికారులు చెబుతున్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌, తదుపరి విక్రయాల్లో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవడంతో ఈడీ రంగంలోకి దిగింది.

Leave a Reply