ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధనకు కృషి కొనసాగుతుంది
వడ్డేపల్లి, ఆంధ్రప్రభ: హనుమకొండలోని పద్మాక్షి గుట్ట లెప్రసీ కాలనీలో సోమవారం దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.
ముందుగా ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతున్నామని తెలిపారు. మంచి మనసున్న నాయకుడిగా ఆయన ఓరుగల్లు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, నాయకులు ఖలీల్, రఘు, హైమావతి, వరుణ్, సారంగం, అనిల్, ఖాజా, సందీప్, నందా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
