22mayipl | నేడు హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్ ఢీ

22mayipl | నేడు హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్ ఢీ

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌
రాత్రి 7.30గంట‌ల‌కు ప్రారంభం
అద్భుత ఫామ్‌లో ఇరు జ‌ట్లు
ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ చేరిన టూ టీమ్స్‌
అగ్ర స్థానం కోసం అమీతుమీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రెండు బిగ్ టీమ్స్ మ‌ధ్య వార్ జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించాయి. టాప్ ప్లేస్ కోసం ఈ రెండు టీమ్స్ ఫైట్ చేయ‌నున్నాయి.

హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్ జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. బెంగళూరు జట్టు 13 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో టేబుల్ టాప్‌లో కొనసాగుతుండగా.. హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్‌లలో 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూర్ గెలిస్తే టేబుల్ లో అగ్రస్థానం అధికారికంగా ఖరారవుతుంది.

హైద‌రాబాద్ జట్టులో ఓపెనర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లతో కూడిన టాప్ ఆర్డర్ బ‌లంగా ఉంది. ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. వీరి ముగ్గురికి తోడుగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో కెప్టెన్ పాట్ కమిన్స్ తోడుగా ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేలు రాణిస్తున్నారు.

బెంగ‌ళూర్ జ‌ట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. తిరుగులేని ఫామ్‌తో దూసుకుపోతోంది. ఆర్‌సీబీని అడ్డుకోవడం హైదరాబాద్ టీమ్‌కు అంత ఈజీ కాదు. విరాట్ కోహ్లీ ఈ సీజ‌న్‌లో విజృంభిస్తున్నాడు. ఒంటిచేత్తో బెంగ‌ళూర్ జ‌ట్టును గెలిపిస్తున్నాడు. వ‌య‌సు పెరుగుతున్నా త‌న స‌త్తా త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తున్నాడు. కోహ్లీకి తోడుగా దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ బ్యాటింగ్‌లో అండగా నిలుస్తున్నారు. వీరికి తోడుగా టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, రొమారియో షెపర్డ్ వంటి భారీ హిట్టర్లు ఉండటం ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్‌ను ప్రమాదకరంగా ఉంది.

CLICK HERE TO READ hardik pandya| మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా

CLICK HERE TO READ MORE

Leave a Reply