నేరాల నియంత్రణలో ముందుండాలి
నేరాల నియంత్రణలో ముందుండాలి
ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: నేరాల నియంత్రణలో పోలీస్ సిబ్బంది ముందుండాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీకి సీఐ పులి రమేష్, ఎస్సై నరసింహారావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీసీపీ దార కవిత ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్, కేసు ప్రాపర్టీ గదులు, స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. తరువాత స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాల రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
స్టేషన్ ఎస్సైలకు అప్పగించిన సెక్టార్ పరిధిలో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డీసీపీ సూచించారు. నేరాలు జరగకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించడం, స్థానిక పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచడం ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్సై, కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

