క్రీడలు శరీర ధారుడ్యానికే కాకుండా క్రమ శిక్షణకు దోహదం
- ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అధ్యక్షులు వల్లే శ్రీనుబాబు
- ఘనంగా అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ సిటీ లీగ్
- సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు
విజయవాడ, ఆంధ్రప్రభ : క్రీడలు శరీర ధారుడ్యానికే కాకుండా క్రమ శిక్షణ అలవర్చుకోవడానికి క్రీడలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అధ్యక్షులు వల్లే శ్రీనుబాబు అన్నారు. చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్ లో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ మహిళల సిటీ లీగ్ ను ఆదివారం ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అస్మిత అంటే ఆత్మవిశ్వాసం, స్వతంత్రత, వ్యక్తిత్వం అని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉంటే క్రీడలో ఎదుగుదలకు ఆస్కారం ఉంటుందని, సాఫ్ట్ టెన్నిస్ రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. విశిష్ట అతిధి ఎన్టీఆర్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి డా.పి.మురళి మాట్లాడుతూ అస్మిత విజయవాడలో నిర్వహించడం ఎంతో సంతోషకరమని, కేంద్ర ప్రభుత్వం మహిళాభివృద్ధికి ఈ టోర్నమెంట్ లు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి కె.దిలీప్ ప్రసన్న బాబు మాట్లాడుతూ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మూడు విభాగాల్లో లీగ్ జరుగుతుందన్నారు.
సింగిల్స్ విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ & అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.డి.నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ కోశాధికారి ఎన్.నాగబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) స్పోర్ట్స్ ఆఫీసర్ (ఖేలో ఇండియా స్కీమ్స్) పి.సురేంద్ర బాబు, ఆంధ్రప్రదేశ్ నెట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి ఎమ్.వీరాంజనేయులు, హైకోర్ట్ అడ్వకేట్ కె.స్టాలిన్, తదితరులు పాల్గొని పతకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో ఏ.ఎస్.వైశాలి ప్రధమ, ఏ.హంసిని వర్మ ద్వితీయ, ఎస్.ఈశ్వరి, బి.గాయత్రిలు తృతీయ స్థానం సాధించారు. జూనియర్ విభాగంలో ఏ.ఎస్.ఎమ్.వైష్ణవి ప్రధమ, ఎస్.శరణ్య ద్వితీయ, ఎస్.గిరిజ, ఎస్.కీర్తనలు తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. సీనియర్ విభాగంలో పి.నాగమణి ప్రధమ, వై.జానకి ద్వితీయ, ఎల్.మానస, బి.జ్యోతిలు తృతీయ స్థానం దక్కించుకున్నారు.
