ఆదివారం ఆరాధనలో ఎమ్మెల్యే కొలికపూడి..
కొమ్మిరెడ్డిపల్లి ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
క్రైస్తవ సోదర సోదరీమణులతో ఆత్మీయంగా మమేకమైన ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు నియోజకవర్గం శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధితో ముందుకు సాగాలని ప్రార్థన
మత సామరస్యం, సోదరభావం మరింత బలోపేతం కావాలి: ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం నిర్వహించిన ఆరాధన కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, తిరువూరు నియోజకవర్గం శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తూ మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, క్రైస్తవ సోదర సోదరీమణులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
