సర్దార్ గౌతు లచ్చన్నకు టీడీపీ శ్రేణుల ఘన నివాళి
మైలవరం, ఆంధ్రప్రభ : సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు, సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని మైలవరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న అందించిన సేవలను, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, చండ్రగూడెం సొసైటీ చైర్మన్ రోశాలు, ఎం వి శ్రీనివాసరావు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
