ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు
- మిస్సమ్మ ఆసుపత్రిలో కేక్ కటింగ్.. మహిళా సిబ్బందికి చీరల పంపిణీ
నర్సాపురం, ఆంధ్రప్రభ: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ఆయన జన్మించిన నర్సాపురం మిస్సమ్మ ఆసుపత్రిలో అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. చిరంజీవి అభిమానుల సందడితో ఆసుపత్రి ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చిరంజీవి జన్మించిన ఆసుపత్రిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి, డాక్టర్ మాదంశెట్టి కోటేశ్వరరావు, పోలిశెట్టి శ్రీనివాస్, మైల వసంతరావు, వలవల నాని, అభిమానులు కోపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి సాంబ, చెన్నంశెట్టి నాగు, దివి సత్యన్, తెలగంశెట్టి సూర్యనారాయణ, గుగ్గిలపు శివరామకృష్ణ, మేడిది ప్రభాకర్, పులపర్తి సుబ్బారావు, గన్నాబత్తుల కుమార్, కర్నేని లక్ష్మీనారాయణ, యాతం మహేష్, నల్లి ప్రసాద్, ఎలుబండి సాయి, విస్సా బుజ్జి, జడ్డు సత్తిబాబు, మాట్లా సూర్య, వలబురెడ్డి కోటి, అడబాల నానినందన్ తదితరులు పాల్గొన్నారు.
కంసాలి బేతపూడిలోనూ వేడుకలు నర్సాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామంలోనూ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమానులు చేపట్టిన వేడుకల్లో గ్రామ పెద్దలు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ చిరంజీవి అభిమాన సంఘం నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
