ఏసీబీ వలలో మామడ ఎస్సై

ఏసీబీ వలలో మామడ ఎస్సై

రూ. 20,వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడిన మామడ ఎస్సై

మామడ, ఆంధ్ర ప్రభ : ఓ కేసు విషయంలో 40,000 లంచం డిమాండ్ చేసిన ఎస్సై అశోక్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అదిలాబాద్ ఏసీబీ డి.ఎస్.పి జి మధు వెల్లడించారు. మామడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండడానికి రూపాయలు 40 వేలు లంచం డిమాండ్ చేశాడని అనంతరం భేరసారాలు తర్వాత రూ.20,000 ఒప్పందం కుదుర్చుకున్నాడని.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు పన్నిన పథకం ప్రకారం సదరు బాధితుడు లంచం ఇస్తుండగా ఎస్సైని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి కరీంనగర్ కోర్టుకు తరలించారు. ఈ ఎస్ఐ పై అనేక అవినీతి ఆరోపణాలు ఉన్నాయని ఉన్నతాధికారులు ఆయనను కఠినంగా శిక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ ని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని వారు పేర్కొన్నారు..

Leave a Reply