ప్రజల సమస్యలు తెలుసుకున్న సర్పంచ్
అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యలపై ఆరా
అచ్చంపేట, ఆంధ్రప్రభ: గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఉప్పరిపల్లి గ్రామ సర్పంచ్ బొజ్జ గీతారెడ్డి సోమవారం అన్ని వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డుల్లో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో నెలకొన్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సమస్యలపై స్థానికులతో చర్చించారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.
గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, వార్డుల వారీగా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని గీతారెడ్డి పేర్కొన్నారు.
ఈ పర్యటనలో ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర సమన్వయకర్త బొజ్జ అమరేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌చారి, వార్డు సభ్యులు వెంకటయ్య, లక్ష్మి, భారతమ్మ, పర్వతాలు, సువర్ణ, రేనమ్మతో పాటు గ్రామ పెద్దలు ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, తోళ్ల రాజు, రమేష్‌గౌడ్, పానుగంటి పర్వతాలు, శేఖర్‌గౌడ్, గ్రామ యువకులు పానుగంటి శేఖర్, రేనయ్య, నందు, కుమ్మరి శివ, శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
