Dealer ship | రేషన్ నిర్వహణ చేత కాక పోతే రాజీనామా చేయండి
Dealer ship | రేషన్ నిర్వహణ చేత కాక పోతే రాజీనామా చేయండి
- పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్.
Dealer ship | మునుగోడు, ఆంధ్రప్రభ : రేషన్ నిర్వహణ చేత కాకపోతే డీలర్ షిప్(Dealer ship)కు రాజీనామా చేయడం ఉత్తమం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ సూచించారు. ఈరోజు ఆయన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం మునుగోడు ఊకొండి గ్రామాలలో రేషన్ దుకాణాల(ration shops)ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ… కొందరు డీలర్లు బాధ్యతారాహిత్యంతో ఉండటం వల్ల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. చౌక ధరల దుకాణాల నిర్వహణ లో ఆలసత్వం, నిర్లక్ష్యం పనికిరావని హెచ్చరించారు.
