TVK Support | రాష్ట్రపతి పాలన రాకూడదనే నిర్ణయం
TVK Support | రాష్ట్రపతి పాలన రాకూడదనే నిర్ణయం
TVK Support | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాల మధ్య డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమిలోని కొన్ని పార్టీలు టీవీకేకు (TVK) మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తానే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
టీవీకేతో కలిసి పనిచేయాలనేది ఆయా పార్టీల నిర్ణయమని, అది వారి ప్రజాస్వామ్య హక్కు అని స్టాలిన్ పేర్కొన్నారు. కూటమి భాగస్వాములను తాను ఎప్పుడూ అడ్డుకోనని, వారు కోరుకున్న రాజకీయ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కల్పించానని చెప్పారు.
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాలిన్ వివరించారు. కూటమి పార్టీలను అడ్డుకునే ప్రయత్నం చేసి ఉంటే రాజకీయ అనిశ్చితి పెరిగి, రాష్ట్రపతి పాలనకు మార్గం సుగమమయ్యేదని అభిప్రాయపడ్డారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీవీకేకు మద్దతు అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడంతో కూటమి రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది.
