గ్రామాల అభివృద్ధికి సహకరించాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రజా ప్రణాళిక- ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలో ప్రత్యేక గ్రామసభలు, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏలేటి రామయ్య పల్లి, నవాబు పేట, చింతకుంట రామయ్య పల్లి, కైలాపూర్ ,రామచంద్రపురం, బావు సింగ్ పల్లి, కొత్తపేట గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచుల,ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.
ఆయా గ్రామసభల్లో మండల అధికారులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి, ప్రజలు సహకరించాలని కోరారు. వర్షాకాలంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో జయశ్రీ ,తాసిల్దార్ వసంత్ కుమార్ , సీఐ మల్లేష్ ,ఎస్సై పోచంపల్లి సతీష్, ఈశ్వరయ్య, హేమ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఓ రామకృష్ణ, సర్పంచులు కొడారి అశోక్, పర్లపల్లి రవి, మటిక సుజాత కొడారి ఓదేలు, గాజే హేమ ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఉమ్మన బోయిన పద్మ, వ్యవసాయ, విద్యుత్తు, పోలీస్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
