ఇండియాలో తయారీ వద్దని హుకుం
నా మాట కాదంటే 25 శాతం సుంకాలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు మరోసారి యాపిల్ సీఈఓ టిమ్‌కుక్‌పై కన్నేర్ర చేశారు. అమెరికాలో అమ్మె ఐఫోన్లు తప్పనిసరిగా అమెరికాలోనే తయారు కావాలని ట్రంప్ గట్టిగా కోరారు. ఇండియాలో లేదా మరో దేశంలో తయారు చేసే ఐఫోన్లను ఇక్కడ విక్రయించవద్దని, ఇలా కాకుంటే 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
తాను చాలా కాలం క్రితమే యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు ఈ విషయం స్పష్టం చేశానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో తెలిపారు.
చైనాపై ట్రంప్ భారీగా సుంకాలు విధించడంతో ఇండియాలో వీటి ఉత్పత్తిని పెంచాలని యాపిల్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. మిడిల్ ఈస్ట్ పర్యటనలోనే భారత్‌లో ఐఫోన్ల తయారీని పెంచడం తనకు ఇష్టంలేదని ట్రంప్ స్పష్టం చేశారు.
