- క్రమబద్దీకరణకు ఊరట
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల (మార్చి) 3 నుంచి ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (ఎల్‌ఆర్‌ఎస్) సంబంధించిన ప్రక్రియ మొదలైంది.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం వరకు రాయితీ ఇస్తుండటంతో ప్లాట్ల యజమానులకు భారీ ఊరట కానుంది. ప్రధానంగా హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో వీటి రిజిస్ట్రేషన్లు ఊపందుకోనున్నాయి.