Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు Andhra Prabha Detail Report
Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు Andhra Prabha Detail Report
$200 బిలియన్ అవసరం
యుద్ధ నిధులకు ట్రంప్ అర్జీ
అమెరికా ఖజానాకు షాక్
కాంగ్రెస్‌లో తీవ్ర చర్చ
డెమోక్రాట్లు ఊ..హూ
ఆలోచనలో రిపబ్లికన్లు
- ఇరాన్ డ్రోన్ దాడులు..
- 16 US జెట్లు మటాష్
- ఇరాన్ గెరిల్లా స్ట్రాటజీ..
- అమెరికాకు డ్రోన్ ఫోబియా
- గగనతలం దక్కలేదు
- టెహ్రాన్ చిక్కలేదు
- పెంటగాన్ సతమతం
( ఆంధ్రప్రభ, న్యూయార్క్ ప్రతినిధి)

పశ్చిమ ఆసియాలోని చిట్టి ఎలుకల్లో ..ఇరాన్ తన సహజ సిద్ధ టామ్ అండ్ జెర్రీ గేమ్ లో అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. మానవాళి మనుగడకు ప్రమాదకర యూరోనియం నిల్వలతో ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ఇరాన్ పై అమెరికా తెగింపు మంచిదే కానీ.. యుద్ధంతో ఇరాన్ ను నిర్వీర్యం చేయాలనే అమెరికా వ్యూహమే ఇక్కడ బెడిసి కొట్టింది. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన ఇరాన్ ఇప్పుడు ఆట్రిబ్యూషన్ స్ట్రాటజీతో \అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒక రకంగా టామ్ అండ్ జెర్రీ గేమ్ ను తలపిస్తోంది.

Trump Seeks 200 Bn : చాతా అవసరం

ఇరాన్‌తో యుద్ధ ఖర్చులు, ఆయుధ నిల్వలను (Weapons Stockpile) నింపే నిమిత్తం $200 బిలియన్ల (సుమారు ₹ 18 లక్షల కోట్లు) అదనపు నిధులను అవసరమని పెంటగాన్ కు అమెరికా అధ్యక్షుడు వోచర్ పంపించారు.

.వైట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉండటానికి ఈ నిధులు అవసరమని, ఇది ష జస్ట్ చిన్న మూల్యం ” (Small price to pay) అని పేర్కొన్నారు. గత మూడు వారాలుగా ఇరాన్ లక్ష్యాలపై వేల సంఖ్యలో దాడులు చేయడం వల్ల ఖర్చయిన క్షిపణులు , ఇతర ఆయుధాలను త్వరితగతిన తయారు చేయాలి. .భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి, అమెరికా సైనిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఈ నిధులు అవసరమని ఆయన వివరించారు.
Trump Seeks 200 Bn : కాంగ్రెస్‌లో ఊహూ

ఈ భారీ నిధుల కోసం అధ్యక్షుడి అర్జీపై అమెరికా పార్లమెంట్ (Congress) లో తీవ్ర చర్చ జరుగుతోంది. డెమొక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రిపబ్లికన్లు చెబుతున్నారు. ఇక రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ మాట్లాడుతూ, “దుష్టశక్తులను అంతం చేయడానికి డబ్బు ఖర్చ తప్పదు ” అని, ఈ అభ్యర్థనను త్వరలోనే కాంగ్రెస్‌కు పంపిస్తామని తెలిపారు.
Trump Seeks 200 Bn : ఇదీ ఇరాన్ పంచ్

ఇరాన్‌తో జరిగిన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికా 16 సైనిక విమానాలను 12 డ్రోన్‌లు మరో నాలుగు విమానాలను కోల్పోయింది. కోల్పోయిన డ్రోన్‌లన్నీ ఆయుధాలు కలిగిన రీపర్ రకానికి చెందినవి. వీటిని అమెరికా సైన్యం ఇరాన్‌పైనా, పశ్చిమ ఆసియా ఇతర ప్రాంతాలలోని ఇతర ప్రత్యర్థులపై తరచుగా ప్రయోగిస్తుంది. కోల్పోయిన నాలుగు విమానాలలో, స్నేహపూర్వక కాల్పుల కారణంగా కువైట్ కూల్చివేసిన 3 ఎఫ్-15 యుద్ధ విమానాలు కాగ, ఇరాక్ లో ఇంధనం నింపే ఆపరేషన్ సమయంలో కూలిపోయిన ఒక కె-135 ట్యాంకర్ ఉన్నాయి. ఈ ట్యాంకర్ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.ఇరాన్ కాల్పులు జరుపుతుండగా పశ్చిమ ఆసియాలోని అమెరికా వైమానిక స్థావరంలో ఒక ఎఫ్-35 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ ల్యాండింగ్‌ను ధృవీకరించింది కానీ, ఆ విమానం ఇరాన్ కాల్పుల వల్ల దెబ్బతిందా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

“విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది, పైలట్ పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది,” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ మీడియా తెలిపింది. ఇక సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ జరిపిన దాడిలో 5 ఇంధన సరఫరా విమానాలు దెబ్బతిన్నాయని గత వారం అమెరికా మీడియా నివేదించింది. ఇప్పటివరకు, ఇరాన్ రక్షణ వ్యవస్థలు 9 రీపర్ డ్రోన్లను కూల్చివేశాయని, జోర్డాన్‌లోని ఒక ఎయిర్‌ఫీల్డ్‌పై క్షిపణి దాడిలో మరొకటి దెబ్బతిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మిగిలిన రెండు రీపర్లు ప్రమాదాల్లో దెబ్బతిన్నాయి. మూడు వారాలుగా ఇరాన్‌పై తీవ్ర దాడులు చేసి, “దాదాపు నిస్సహాయంగా” వదిలేసినప్పటికీ, అమెరికా ఇజ్రాయెల్ కు ఇరాన్‌పై సంపూర్ణ వాయు ఆధిపత్యం లేదు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ గతంలో మాట్లాడుతూ, అమెరికాకు కేవలం స్థానిక వాయు ఆధిపత్యం మాత్రమే ఉందని, అంటే అమెరికా ఇరాన్ గగనతలంలోని నిర్దిష్ట ప్రాంతాలను మాత్రమే నియంత్రిస్తోందని, మిగిలిన ప్రాంతం ఇంకా వివాదాస్పదంగానే ఉందని అన్నారు.
Trump Seeks 200 Bn : 16 జెట్లు మటాష్

ఈ యుద్ధంతో అమెరికా ఖజానాకు భారీ చిల్లు పడింది. ఆర్థిక నష్టం తప్పటం లేదు. ఇప్పటివరకు దాదాపు $2.55 బిలియన్ల (సుమారు ₹26,000 కోట్లు) సైనిక పరికరాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ క్షిపణి దాడిలో ఖతార్‌లోని అల్-ఉదీద్ ఎయిర్ బేస్‌లోని AN/FPS – 132 ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థ ధ్వంసం అతిపెద్ద సింగిల్ లాస్.

దీని విలువ ఎంతంటే.. $1.1 బిలియన్లు (₹ 1025 కోట్లు) ఇక యుద్ధం ఆరంభం నుంచి మొదటి 6 రోజుల్లో దాదాపు $11.3 బిలియన్లు 16ఖర్చయ్యాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. తాజాగా ఈ ఖర్చు $ 20 బిలియన్లు ( ₹1.8 లక్షల కోట్లు( కు చేరింది. పెంటగాన్ సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 13 మంది అమెరికా సైనికులు మరణించారు (7 మంది పోరాటంలో, 6 మంది విమాన ప్రమాదంలో) దాదాపు 200 మంది గాయపడ్డారు.
ALSO READ : GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు ధ్వంసం Andhra Prabha Detail ReoprtA
