Stock Market | లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. క్రమంగా నష్టాలు చవిచూసిన మార్కెట్లు నేడు.. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోలుకు దిగడంతో లాభాల బాట పట్టాయి.
ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 500 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 23,500పైన ప్రారంభమైంది. ఉదయం ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 488 పాయింట్ల లాభంతో 77,675 వద్ద.. నిఫ్టీ 150పాయింట్లు పెరిగి 23,509 వద్ద ఉన్నాయి.