దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు..

నర్సంపేట, ఆంధ్రప్రభ : రైతులు మక్కజొన్నలు దళారులకు అమ్మి మోసపోవద్దని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఉధ్భోదించారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ లో కలెక్టర్ సత్య శారద మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్ తో కలిసి మార్క్ ఫెడ్ మక్కా జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 8 మార్క్ ఫెడ్ మక్కజొన్నల కనుక్కోవాలి కేంద్రాలను ప్రారంభించను న్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్ కోసం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు.
గత నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రభ జిల్లా టాబ్లెట్ లో మొక్కజొన్న రైతులకు మద్దతు కరువు అన్న శీర్షికతో వార్తను ప్రచురించింది. దీనికి స్పందించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని అభ్యర్థించారు. దీనికి స్పందించిన మంత్రి త్వరలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి అధికారులకు ఆదేశించామని తెలిపారు.
ఈ నేపథ్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో దళారుల నుండి రైతులకు మోసపోకుండా శుక్రవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మార్క్ ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెరువుతో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నర్సంపేట డివిజన్లో లక్ష ఏడు ఎకరాలలో మొక్కజొన్న పంటలను పండించడంతో మూడు లక్షల టన్నుల మొక్కజొన్న పండిస్తున్నట్లు శ్రీనివాస్ వివరించారు. నర్సంపేట పట్టణంలోని సర్వాపురం గ్రామానికి చెందిన వీరయ్య అనే రైతుకు సంబంధించిన మొక్కజొన్నలను తేమ పరిశీలించి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డిఎం సురేఖ, డి.ఎస్.ఓ నీరజ, ఏడిఓ అనురాధ, స్పెషల్ ఆఫీసర్ ప్రసూన, మార్కెట్ ఫెడ్ డిఎం రంజిత్ రెడ్డి ఆర్డీవో ఉమారాణి తహసిల్దార్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ లక్ష్మీ పెండెం రామానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్, ఏవో కృష్ణ కుమార్ ఏఈఓ అశోక్ మార్కెట్ సీఈవో రాజులతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యాపారులు, కొనుగోలుదారులు,రైతులు పాల్గొన్నారు.
