Train Cancellations | పలు రైళ్లు తాత్కాలిక రద్దు

Train Cancellations | పలు రైళ్లు తాత్కాలిక రద్దు

Train Cancellations | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ముఖ్యంగా తిరుపతి వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగనున్నాయి.

తమిళనాడులోని అరక్కోణం యార్డ్ విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్–తిరుపతి మధ్య నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్లు ఈనెల 26, 28 తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

అలాగే అరక్కోణం, చెన్నై సెంట్రల్, తిరుత్తణి సెక్షన్లలో నడిచే 47 సబర్బన్ రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు చేశారు. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటి సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. రైళ్ల రద్దు, షెడ్యూల్ మార్పుల కారణంగా ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. తాజా సమాచారం కోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా సంబంధిత రైల్వే అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించాలని కోరింది.

Leave a Reply