tragic incident | ఐదుగురు మృతి
tragic incident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : లారీ, బైక్ లను ఢీకొట్టిన ఘటన ఐదుగురు మృతిచెందిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన లారీ మూడు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
