శోభాయమానంగా శ్రీరాములోరి పల్లకి శోభయాత్ర

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామాలయం (శ్రీ గోవింద్ మహారాజ్ మఠ్ సంస్థాన్)లో సీతారాములోరి పల్లకి శోభయాత్ర భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది. శ్రీరాముని జన్మోత్సవం, కల్యాణోత్సవం,హనుమాన్ జయంతి అనంతరం ప్రతి సంవత్సరం శ్రీరాములవారి శోభయాత్ర నిర్వహిస్తారు.

ఉదయం అందంగా అలంకరించిన పల్లకిలో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేత ఉత్సవమూర్తులను పల్లకిలో ఏర్పాటుచేసినా అనంతరం మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్ కొబ్బరికాయ కొట్టి ఈపల్లకి శోభాయాత్రను ప్రారంభించారు.

శ్రీ కేశవ్ మహారాజ్,శ్రీ గోవింద్ మహారాజ్,శ్రీ శ్యామ్ మహారాజ్,శ్రీ సోమనాథ్ మహారాజ్ ఆధ్వర్యంలో జుక్కల్ ప్రధాన వీధులగుండ శోభయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది.భక్తులు,ప్రజలు,మహిళలు,ప్రజాప్రతినిధులు గ్రామపెద్దలు వందలాదిగా శోభయాత్రలో పాల్గొనడం జరిగింది.భక్తుల భజనకీర్తనలు,నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రామనామస్మరణతో జుక్కల్ మారుమోగింది.జుక్కల్ గ్రామస్థులు ప్రజలు ఈ శ్రీరాములవారి శోభాయాత్రను కనులారా తిలకించారు.

Leave a Reply