వార్డు పరిశుభ్రతపై మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రత్యేక దృష్టి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆయన మున్సిపల్ వైస్ ఛైర్మెన్ కొత్తగా రాజకీయాల్లో కి వచ్చారు. ఆయన పేరు రాగంషెట్టి సతీష్ ఆయన పదవీ చేపట్టిన నాటి నుంచి తాను గెలిచిన నాటి నుంచి 17 వ వార్డు లో పారిశుధ్యంపైనేప్రత్యేక ద్రుష్టి సారించారు. ఎక్కడ విదుల్లోకాని రోడ్డు పై చెత్త, మురికి కాలువల్లో పేరుకు పోయిన మురికి నీరు ను చూసి చలించి పోయారు.

మున్సిపాలిటీ సిబ్బందిని పిలిపించి క్లినింగ్ పైనే ప్రత్యేక దృష్టి సారించారు. వార్డులో దగ్గర ఉండి శనివారం కాలువల్లో 15 ఏళ్ల క్రితం పేరుకు పోయిన మురికి నీరు చెత్త ను మున్సిపల్ సిబ్బంది తోక్లీన్ చేయించారు. అంతే కాదు వార్డు లో ప్రధానరహ దారి పై పెరిగిన పిచ్చి మొక్కలను తొలగింపజేసి అంతా క్లీన్చేయించి పారిశుద్ధంపై తనకున్న ఆసక్తి ని చాటిచెప్పారు.వార్డు లో మున్సిపల్ వైస్ చైర్మన్ పారిశుధ్యం పై పెట్టిన దృష్టి పై ప్రజలు జై జై లు కొడుతున్నారు.

Leave a Reply