వివాహిత దారుణ హత్య
వివాహిత దారుణ హత్య
పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు పట్టణంలో చౌదరి పేట ప్రతాప్ జూనియర్ కాలేజీ వీధిలో వివాహిత హత్య జరిగింది. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్టు సమాచారం. నందివాడ మండలానికి చెందిన వివాహిత తన బిడ్డలను భర్త దగ్గరే వదిలేసి గత కొంతకాలం నుంచి పామర్రులోని చౌదరి పేటలో ఓ ఇంటిని అద్దెకు తీస్కొని ఓ వ్యక్తి తో సహాజీవనం సాగిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆమె భర్తతో అతను సోదరులు సోమవారం వేకువ జామున కొట్టి హతమార్చినట్టు సమాచారం. పోలీసులు సంఘటన ప్రదేశానికి సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు.
