ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం..
ప్రతి అర్జీపై తక్షణ స్పందన
పాయకాపురం, ఆగష్టు14 (ఆంధ్ర ప్రభ) : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని వినతులను స్వీకరించారు.
ప్రజలు అందించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈకార్యక్రమంలో కార్యాలయం ఇంచార్జి ఘంటా కృష్ణ మోహన్, 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, కంచేటి నాగరాజు, బుదాల సురేష్, డిడి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.
