విద్యార్థుల తిరంగా ర్యాలీ
చిట్టినగర్ , ఆంధ్రప్రభ: విజయవాడ చిట్టినగర్ లో ఉండే శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ నల్లాని సూర్యారావు ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఘర్ ఘర్ కు తిరంగా అని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు ఘనం గా జాతీయ జెండాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వేష ధారణలతో పాటు భారత మాత వేష ధారణ అలరించారు.
ఈ సందర్భంగా గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ నల్లాని సూర్యారావు మాట్లాడుతూ.. 80 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని దేశ అభివృద్ధి లో తమ వంతు పాత్ర పోషించాలి అని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ పి.తులసి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమన్వయంతో నిర్వహించారు ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, వెంకటేశ్వరరావు, హేమంబర్, కూటమి నాయకులు దేవిన హరిప్రసాద్, ఎం నిర్మల, సి.హెచ్ పాపారావు, కొరగంజి మాధవ, బాయన శంకర్, పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
