విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ..
పరకాల, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పరకాల మున్సిపాలిటీ రెండో వార్డ్ కౌన్సిలర్ బొచ్చు శ్యామల బాబురావు ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. 80 వ భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం రోజు పరకాల మున్సిపల్ 2వ వార్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ను వార్డు కౌన్సిలర్ బొచ్చు శ్యామల బాబురావు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
