ఆ.. నలుగురు కౌన్సిలర్లను సన్మానించిన ఎంవి చారి..

ఆ.. నలుగురు కౌన్సిలర్లను సన్మానించిన ఎంవి చారి..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి గ్రామానికి చెందిన సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి చారి ఆధ్వర్యంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ ఊదరి యాదయ్య, 5వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్, 6వ వార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత – చిరంజీవి, 15వ వార్డు కౌన్సిలర్ గడ్డం ఇందిర – రాజారత్నం లను అభినందిస్తూ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కౌన్సిలర్లు ఆలే శ్రీలత – చిరంజీవి, కొయ్యడ శేఖర్ గౌడ్, ఊదరి యాదయ్య, గడ్డం ఇందిర రాజారత్నంలు మాట్లాడుతూ.. తమ పై ఎంతో నమ్మకంతో భారీ మెజారిటీలతో గెలిపించిన వార్డుల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వార్డుల అభివృద్ధి కోసం, ప్రజలకు అందుబాటులో ఉండి తాము ఇచ్చిన అన్ని హామీలను పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తామని, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు ఎం.వి చారి, ఉపాధ్యక్షులు రాజుల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి సిల్వేరు యాదేష్, బత్తుల జనార్ధన్ తో పాటు నాలుగు వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply