1,300 trees | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

1,300 trees | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

1,300 trees | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు పార్కు పరిధిలో చెట్లను నరకొద్దని సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పార్కు పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను తొలగించవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం సుమారు 1,300 చెట్లు నరుకుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి కోర్టుకు తెలిపారు.

చెట్లు తొలగించకుండా నిర్మాణం చేపట్టే ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం రాత్రింబవళ్లు చెట్లు నరుకుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆరోపించారు. వాదనలు విన్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

Leave a Reply